హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హేమంత్‌కు జిల్లా జైలులో ప్రత్యేక భద్రత

ATP: రాప్తాడు దాడి నిందితుడు హేమంత్‌కు జిల్లా జైలులో ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రత్యేక బ్యారక్‌లో ఉంచనున్నట్లు జైలు అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నడవలేని స్థితిలో ఉన్నందున వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. జైలు సిబ్బంది పర్యవేక్షణలో అన్ని పనులు నిర్వహిస్తామని, వైద్యుల సూచనల మేరకు మందులు అందిస్తామని వెల్లడించారు.