హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిల్‌పై శబరిమలకు హరికృష్ణ యాత్ర

విజయనగరం: చీపురుపల్లికి చెందిన కొట్టేడ హరికృష్ణ సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలుదేరారు. 1,514 కిలోమీటర్ల దూరాన్ని 20 రోజుల్లో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో స్వాముల పీఠాల్లో బస చేస్తానన్నారు. విజయనగరం వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు వెళ్లి వీడ్కోలు పలికారు.