హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ నమోదును వేగవంతం చేయండి: కలెక్టర్

కోనసీమ: ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యా యులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం భారత ఎన్నికల సంఘంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 2,592 మంది దరఖాస్తులు అందాయని తెలిపారు.