విశాఖలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వీరఘట్టం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రుతిక్ (18) విశాఖలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు సాయితో బైక్‌పై వెళ్తుండగా మధురవాడ స్టేడియం సిగ్నల్ వద్ద లారీ ఢీకొట్టింది. రుతిక్ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


