హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం చేరుకున్న శేష మల్లేశ్వరి భౌతికకాయం

కృష్ణా: హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర సోదరి నడకుదిటి శేష మల్లేశ్వరి భౌతికకాయం మచిలీపట్నం చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో సర్కిల్ పేటలోని స్వగృహానికి పార్థివ దేహాన్ని తరలించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నివాళులర్పించారు.