హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ

KMM: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి ఏహెచ్‌ఎస్ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఫిరంగి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి విద్యా సంబంధిత సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, వంటశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువులు అధికారులు పాల్గొన్నారు.