హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రోన్లతో క్రిమిసంహారక మందుల పిచికారీ

WGL: గ్రేటర్ వరంగల్‌ల్లో దోమల నివారణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు కమిషనర్ T. వెంకన్న తెలిపారు. 66 డివిజన్లలో దశలవారీగా డ్రోన్ల ద్వారా నాలాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నయీంనగర్ రాజాజీ నాలా వద్ద పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.