హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

WGL: నల్లబెల్లి మండలంలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్బీఎస్కే టీమ్ వైద్యులు డా. భవిత, డా. స్వర్ణలత, ఫార్మాసిస్ట్ స్మిత, ఏఎన్ఎం జులేఖ పాల్గొని పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. చికిత్స అవసరమైన ఒక విద్యార్థిని ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు.