మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతిఘనపూర్‌కు చెందిన శివప్రసాద్ (23) అదృశ్యమయ్యాడు. భార్య తరచూ గొడవపడుతూ కొడుతోందని, పెద్దల ముందు అవమానిస్తోందని, బతకాలని లేదని సెల్ఫీ వీడియోలో చెప్పి తల్లిదండ్రులకు పంపాడు. స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లగా అది కొత్తూరు వద్ద ఆగి ఉందని సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
తెలంగాణ
సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం


