హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్

పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) రవీందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ బాధితుడి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.