హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం

PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులుతో కలిసి సెర్ప్ ఏపీఎం నర్సమ్మ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ప్రైవేటు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉప సర్పంచ్ సామల నాగభూషణం, గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపెల్లి పోచయ్య వార్డు సభ్యులు పాల్గొన్నారు.