హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

NRPT: నర్వ మండలంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. బుధవారం మండల కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో లంకల గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, రాయికోడ్ గ్రామంలో నూతన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.