NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో అర్హులందరూ చేరాలని గ్రామ కార్యదర్శి రవిశంకర్ కోరారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక నమోదు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వారు రేషన్, ఆధార్ కార్డులతో హాజరుకావాలని సూచించారు. రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమాలో చేరాలని సూచన


