హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా మారిన పారిగాం వంతెన

ASF: సిర్పూర్ (టి) మండలంలోని పారిగాం వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. వంతెనపై పలుచోట్ల దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అవాంచనీయ ప్రమాదాలు జరగకముందే వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.