NGKL: గోపాల్దిన్నె, సింగోటం రిజర్వాయర్లను కలిపే లింక్ కెనాల్ పనుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. నీటిపారుదల అధికారులతో చేసిన సమావేశంలో పెండింగ్ పనుల వివరాలు ఆరా తీశారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేసి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని, ఆటంకాలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
లింక్ కెనాల్ పనులపై మంత్రి సమీక్ష


