హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియాకు నానో డీఏపీ షరతు

SDPT: దౌల్తాబాద్‌లోని జ్యోతి ఫర్టిలైజర్స్ యజమాని యూరియా కావాలంటే నానో డీఏపీ కూడా కొనాలని షరతు పెడుతున్నాడని రైతులు ఆరోపించారు. తిరుమలాపూర్ రైతు రైతు చాకలి వెంకటయ్య ఆన్‌లైన్‌లో 24 బస్తాల యూరియా బుక్ చేసి మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకూ వేచి చూసినా ఇవ్వలేదని తెలిపారు. గతంలో ఫిర్యాదులకు స్పందన లేదని, వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.