సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చిలుకూరు మండలం జేజేఆర్ నగర్‌కు చెందిన 13 ఏళ్ల పూజిత కుడి అండాశయంలో ఉన్న 12 సెంటీమీటర్ల కణితిని తొలగించారు. రెండు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు పరీక్షలు నిర్వహించి కణితిని గుర్తించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తెలంగాణ
13 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్స


