NRPT: ధన్వాడ మండలానికి చెందిన దండిగి రాము సతీమణి అనురాధ కూచిపూడి నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను చాటి ప్రథమ బహుమతి అందుకున్నారు. కాశీలో నిత్యాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నిత్య ప్రదర్శనలో ఆర్ట్స్ కమిటీ తరఫున ఆమె పాల్గొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు పోటీగా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో బహుమతి అందుకోవడంతో పలువురు అభినందించారు.
తెలంగాణ
కూచిపూడి పోటీల్లో అనురాధకు ప్రథమ బహుమతి


