RR: మొయినాబాద్‌లోని NTR స్కూల్లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. స్కూల్ రెండో అంతస్తు నుంచి విద్యార్థిని నవనీత (15) కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిందా లేదా ఎవరైనా తోశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.
తెలంగాణ
మొయినాబాద్ NTR స్కూల్లో విషాదకర ఘటన


