హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలిన రక్షణ గోడ.. పట్టించుకోని అధికారులు

GDWL: మానవపాడులోని జూరాల లింకు కాల్వ వద్ద రక్షణ గోడ కూలిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు ఉన్న గోడ సైతం దెబ్బతిన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రక్షణ గోడకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.