హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇబ్రహీంపట్నంలో మనిషి కాలు కలకలం!

RR: ఇబ్రహీంపట్నంలోని గాంధీనగర్‌లో నివాసాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో మనిషి కాలు లభ్యమైంది. స్థానిక గార్డెన్ వెనుక కాలు పడి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. అది పురుషుడిదా, మహిళ అనేది తెలియాల్సి ఉంది. సమీపంలోని శ్మశానవాటిక నుంచి కుక్కలు తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.