హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైన్స్‌లో చోరీ కలకలం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న వైన్స్‌లో దొంగలు చోరీకి పాల్పడినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో వైన్స్‌లోకి చొరబడిన దుండగులు నగదు, మద్యం బాటిళ్లను అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. చోరీకి గురైన నగదు, వస్తువుల విలువ ఎంత? దుండగులు ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.