NRPT: నారాయణపేటలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 100 హెల్మెట్లను పంపిణీ చేశారు. దాతల సహకారంతో భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రిలకు హెల్మెట్లను పంపిణీ చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని చెప్పారు.
తెలంగాణ
పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ


