హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓ వైపు మంచు.. మరోవైపు చలి!

VKB: జిల్లాలో చలి, పొగ మంచు తీవ్రత పెరిగింది. పరిగి మండలంలోని తొండపల్లి, పరిగి, కుదావన్పూర్, రంగంపల్లి, మిట్టకోడూర్, రూపెఖాన్‌పేట్, చిగురాల్పల్లి తదితర గ్రామాలలో ప్రజలు పొగ మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో ప్రయాణం చేయాలి అంటే కష్టంగా ఉందని వాహనదారులు తెలిపారు. లైట్స్ వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.