హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

HYD: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. చార్మినార్ టాస్క్ ఫోర్స్, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ క్యారియర్‌ను అరెస్టు చేసి, 21 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.10.50 లక్షలుగా అంచనా వేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.