హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్ కోచ్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ADB: ఉట్నూర్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఖాళీగా ఉన్న అథ్లెటిక్స్ కోచ్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ తెలిపారు. అభ్యర్థులు NIS డిగ్రీతో పాటు ఏడాది డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి గల వారు ఈనెల 23 వరకు ఉట్నూర్‌లోని డీడీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.