హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీతక్క

MLG: మంగపేట మండలంలో మంగళవారం మంత్రి సీతక్క 25 గ్రామపంచాయతీలకు చెందిన 659 మందికి నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులు అందజేశారు. 467 మహిళా సంఘాలకు రూ.35.25 కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.