MHBD: నెల్లికుదురు మండలం బంజర గ్రామ శివారు సున్నపురాళ్ల తండాకు చెందిన బాదావత్ నవకిశోర్ (14) హైదరాబాద్‌లో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తల్లిదండ్రులతో కలిసి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లిన నవకిశోర్ 9వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో హౌస్ వైరింగ్ పనులకు వెళ్తుండగా మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకుంది.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి


