హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

BHPL: గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా మహదేవపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పెద్దంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్సై ఎం. సాంబమూర్తి, 21 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు, నిబంధనలను పరిశీలించి ఉల్లంఘనలకు పాల్పడిన 17 వాహనాల యజమానులకు జరిమానాలు విధించారు.