హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్న ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

SDPT: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు నిర్వహించారు.