హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ

ADB: ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. వీటివల్ల నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ ఎంతో సులభతరం అవుతుందన్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేయడం, శాఖపై నమ్మకం పెంచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడమే 'పోలీస్ మీకోసం' ప్రధాన ఉద్దేశమని తెలిపారు.