హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ చర్యలు

BDK: బూర్గంపాడు మండలం సోంపల్లి కిన్నెరసాని వద్ద అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. రాత్రివేళల్లో ఇసుక తరలింపును నిరోధించేందుకు కందకాలు తవ్వించారు. ఇదే విధంగా సారపాక గోదావరి వంతెన కింద కూడా చర్యలు తీసుకుని అక్రమ రవాణాను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు అధికారులకు నిరంతరం సమాచారం అందించాలని కోరారు.