హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న MLA జారే

BDK: ములకలపల్లి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం MLA జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారణ జరిపారా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.