హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ చేయూత పెన్షన్లు మంజూరు

SRCL: ముస్తాబాద్ మండలంలో 625 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హుల ఎంపికను అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి పారదర్శకంగా చేపట్టామన్నారు. ఈ నెల 18 వరకు మంజూరు పత్రాలు అందజేస్తామని, 19వ తేదీ నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందని తెలిపారు