హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకులో యువకుడికి తీవ్ర గాయాలు

హన్మకొండ నక్కలగుట్ట హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ బ్యాంకులో మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.