హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్ఆర్ నగర్ భూములపై ఎమ్మెల్యే కన్ను: దాస్యం

HNK: వైఎస్ఆర్ నగర్ కాలనీ భూములపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కన్ను వేసి భారీ కుట్రకు తెరలేపినట్లు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కాజీపేట మండల కేంద్రంలో మంగళవారం ఆయన ఈ విషయమై మాట్లాడారు. గుడిసె వాసులైన పేదలకు నెల రోజుల్లో పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ కూడా ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి పాల్గొన్నారు.