వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మంగళవారం మామునూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
మామునూరు స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ


