హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుడగ జంగం భవనానికి రూ.5 లక్షలు

NRML: కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. మంగళవారం బుడగ జంగం సంఘ భవన నిర్మాణానికి మంజూరైన రూ.5 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు అందజేశారు. భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.