హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విభిన్న పంటల సాగుతో మెరుగైన ఆదాయం'

SRCL: వరి సాగుకు స్వస్తి పలికి కూరగాయల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న ముస్తాబాద్ మండలం బందనకల్ రైతు చింతలకుల చంద్రంను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. మూడు ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ ఏడాదికి రూ. 3 నుంచి 4 లక్షల ఆదాయం పొందుతున్నట్లు రైతు వివరించారు. పంటల సాగు, దిగుబడి, మార్కెటింగ్ వివరాలను తెలుసుకున్నారు.