హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె నుంచి జాతీయ స్థాయికి జగదీష్

KMR: పెద్ద కొడప్గల్(M) జగన్నాథ్‌పల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి జగదీష్ అండర్‌-17 జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం టీఆర్పీ పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాదవ్ ఈశ్వర్, బిచ్కుంద సీనియర్ నాయకుడు పాషా సేట్ జగదీష్‌ను సన్మానించి రూ.2 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.