హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRCL:లాలా లజపతిరాయ్‌కు ఘన నివాళులు

SRCL: వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ 98వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో లాల్-బాల్-పాల్ త్రయంలో కీలకపాత్ర పోషించారని, సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో పోలీసుల లాఠీచార్జికి గాయపడి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.