హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతగూడలో రైతులకు 'ఖేత్ బచావో'పై అవగాహన

​RR: చింతగూడలో సర్పంచ్ మెక్కొండ నరేష్ ఆధ్వర్యంలో 'ఖేత్ బచావో' కార్యక్రమం నిర్వహించారు. ఐసీఏఆర్ రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ అనూష మాట్లాడుతూ.. భూసారం పెంచడానికి నేల పరీక్షల ఆధారంగా సహజ ఎరువులు వాడాలని, పంట మార్పిడి, నీటి పొదుపు పాటించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.