హైదరాబాద్: 28°C
వార్తలు

శివాజీ రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు

ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్ అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫారాలు, పార్శిల్ ప్రాంతాలు, రైళ్లలో సోదాలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.