విజయనగరం: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రాజుల తిమ్మాపురం గ్రామాన్ని ఎస్సై సన్యాసినాయుడు శుక్రవారం రాత్రి సందర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నచ్చిన వ్యక్తికి వేసుకోవాలని సూచించారు. అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అల్లర్లకు దూరంగా ఉండాలి: ఎస్సై


