ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో నిన్న ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, తహసీల్దార్ ప్రసాదరావు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి పార్టీ నేత, కార్యకర్త తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించకుండా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమావళిపై పార్టీలకు అవగాహన


