హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్టిఫికెట్ లేకపోతే డిక్లరేషన్ తప్పనిసరి: MPDO

WG: MPTC అభ్యర్థులు నామినేషన్లతో పాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని నరసాపురం MPDO నాసరురెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ లేకుంటే గెజిటెడ్ అధికారి సంతకంతో డిక్లరేషన్ జత చేయాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే నామినేషన్లు తిరస్కరిస్తామని హెచ్చరించారు. ఈ నెల 21 నుంచి నామినేషన్లు, 26న పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.మొత్తం 75 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.