హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు మేయర్ బరిలో అత్తాకోడళ్లు

KRNL: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూష, వైసీపీ అభ్యర్థి సుశీల అత్తాకోడళ్లుగా ఉండటం చర్చనీయాంశమైంది. విజయ ప్రత్యూష సోదరి ప్రియాంక, సుశీల కుమారుడిని వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. వేర్వేరు పార్టీల తరఫున వీరు పోటీలో ఉండటంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.