హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్భయంగా ఓటు వేయాలి: గొలుగొండ ఎస్సై

గొలుగొండ: స్థానిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా,నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై పి.రామారావు సూచించారు.ఓటర్లకు డబ్బు,మద్యం, బహుమతులతో ప్రలోభపెట్టడం,బెదిరించడం, కులమతాల పేరుతో రెచ్చగొట్టడం నేరమన్నారు. అనుమతి లేకుండా ప్రచారం చేయరాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని తెలిపారు. ఎన్నికల అక్రమాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.