హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP నేతలపై దాడులను ఖండించిన ఎంపీ

KRNL: పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం ఖండించారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.