హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వేండ్రలో వైసీపీకి షాక్!

KKD: పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీ, బీజేపీల్లో చేరాయి. శుక్రవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని కూటమిలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.